ఆర్మీ బాటిళ్లు తీసుకువస్తుండగా పట్టుబడ్డ ఇద్దరు కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారం అధిక ధరకు విక్రయం బాటిళ్లతోపాటు వాహనం సీజ్
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అక్రమ దందాకు తెరలేపారు. ఆర్మీ క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకువచ్చి జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో వాటిని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటికీ వారికి చిక్కకుండా చీకటి దందాను కొనసాగిస్తుండగా, ఎట్టకేలకు ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 97 బాటిళ్లతోపాటు వాహనం సీజ్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా దందా
పట్టణంలోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామానికి చెందినవాడు. గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన మరో రిటైర్డ్ ఉద్యోగి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు స మాచారం. జిల్లాకేంద్రంలో నివాసం ఉండే వ్యక్తి గత పదేళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇంటి వద్ద బాటిళ్లను డంప్ చేయడం, గాంధీ పార్క్ రెండో గేటు వద్ద అవసరం ఉన్నవారికి తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా తన బైక్ డిక్కీలో తెచ్చి వాటిని రెండింతలకు అమ్ముతాడు. మద్యం షాపులకు సెలవు ఉన్నరోజు సదరు వ్యక్తికి ఫుల్ గిరాకీ. దీంతో వైన్స్‌షాపుల యజమానులతో పాటు ఎకై ్సజ్ శాఖకు ఆదాయం నష్టం వాటిల్లుతుంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ బాటిళ్లను ఆర్మీ, రిటైర్డ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో విక్రయిస్తారు. వీటిపై కూడా అమ్మవద్దని రాసి ఉంటుంది. ఈ బాటిళ్లపై ట్యాక్స్, జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. సదరు వ్యక్తులు తెలిసిన ఆర్మీ ఉద్యోగుల నుంచి ఐడీకార్డులు తీసుకుని మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వాటిని అక్రమంగా తరలిస్తారు. వీరు తీసుకువచ్చే బాటిళ్లు సగం ధరకు అక్కడ లభిస్తే జిల్లా కేంద్రంలో వైన్స్‌షాపుల్లో లభించే ధరకు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఎలా పట్టుబడ్డారంటే..
గత కొన్నిరోజులుగా వీరిపై ఎకై ్సజ్ అధికారులు నిఘా పెట్టారు. భోరజ్ మండలంలోని భోరజ్ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి అక్రమంగా కారులో 97 బాటిళ్లు తీసుకువస్తున్నారు. వీటిలో ఆఫ్టర్‌డార్క్, డివార్స్, బ్లాక్‌డాగ్, పీటర్‌స్కాచ్ వివిధ బ్రాండ్స్ బాటిళ్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారు ల వాహనతనిఖీల్లో వీరి బండారం బయటపడింది. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చే శారు. అయితే ప్రస్తుతం వారికి స్టేషన్ బెయి ల్ ఇవ్వడంపై జిల్లా కేంద్రంలో చర్చ సాగుతోంది. ఎకై ్సజ్ సీఐ.. వారిని సోమవారం రిమాండ్‌కు పంపుతామని చెబుతున్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు
నిబంధనల ప్రకారం ఫారెన్, ఆర్మీ, ఇతర రాష్ట్రాల మద్యం జిల్లాలో అమ్మడానికి అనుమతి లేదు. డిఫెన్స్ బాటిళ్లు ఆర్మీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే క్యాంటీన్‌లో విక్రయిస్తారు. వీటిని వీరు మాత్రమే వినియోగించాలి. అమ్మడానికి వీలులేదు. ఎక్కడైన నిబంధనలు ఉల్లంఘించి అమ్మితే కేసులు నమోదు చేస్తాం. – ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ


