నిర్మల్‌టౌన్: స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ సైక్లింగ్ క్లబ్ నిర్వాహకుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్‌కుమార్ ఆదివారం వినూత్న రీతిలో రన్నింగ్ చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఖానాపూర్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రం వరకు ఉన్న 32 కిలోమీటర్ల దూరాన్ని ఆ యన కేవలం 3 గంటల్లోనే పరుగెత్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజులో కొంత సమయాన్ని వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా వ్యాయామం కోసం కేటాయించాలని సూచించారు. ఈ సుదీర్ఘ పరుగును విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ఖానాపూర్, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు, స్థానిక యువత, క్రీడాకారులు అభినందించారు.


