దులీప్‌ ట్రోఫీకి హిమతేజ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

దులీప్‌ ట్రోఫీకి హిమతేజ ఎంపిక

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

ఆదిలాబాద్‌: తనదైన ఆటతీరుతో సత్తా చా టుతూ జిల్లా కేంద్రానికి చెందిన కొడిమె ల హిమతేజ మరో అరుదైన ఘనత సా ధించాడు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రంజీ ట్రోఫీకి ఎంపికై న తొలి క్రికెటర్‌గా నిలిచిన ఈ యువ ఆటగాడు విజయ్‌ హజారే, బుచ్చిబాబు టోర్నీల్లోనూ అత్యధిక పరుగులు సాధించి ప్రతిభ చాటాడు. తాజాగా నిర్వహించిన టీజీ–20 టోర్నీలోనూ పరుగుల వరద పారించి బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు. తాజాగా ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీకి సౌత్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జేసీ అ కాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో కేక్‌ కట్‌ చేసి హిమతేజకు వీడియోకాల్‌ ద్వా రా శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి మా ట్లాడుతూ జిల్లా క్రికెటర్‌.. దులీప్‌ ట్రోఫీకి ఎంపిక కావడం గర్వకారణమని కొనియాడా రు. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కోచ్‌ జయేంద్ర పటాస్కర్‌, కౌన్సిలర్‌ గంట జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement