పెళ్లింట విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

● ఇంటిపెద్ద ఆకస్మిక మరణం ● తీవ్ర దుఃఖంలో కుటుంబసభ్యులు ● కోటపల్లిలో ఘటన

కోటపల్లి: పక్షం రోజుల్లో కూ తురు పెళ్లి.. కుటుంబం ప నుల్లో బిజీగా ఉన్న తరుణంలో ఇంటి పెద్ద మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో నింపింది. మండలకేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలకేంద్రానికి చెందిన కత్తర్ల శంకర్‌(49) గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్‌ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి నిద్రపోయాడు. ఈ క్రమంలో ఆయనకు ఎవరో ఫోన్‌ చేస్తుండగా ఎంతకీ లిఫ్ట్‌ చేయలేదు. భార్య పద్మ వచ్చి గమనించి నిద్రలేపగా స్పందించడం లేదు. వెంటనే అందించిన సమాచారంతో అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని శంకర్‌ను పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు. ఈనెల 16న పెద్ద కూతురు సాయికీర్తన వివాహం జరగాల్సి ఉండగా ఇంటి పెద్ద మృతితో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement