కాజీపేట: జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం బైక్‌ల చోరీకి పాల్పడుతు న్న అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. కాజీపే ట పీఎస్‌లో శనివారం ఈమేరకు వివరా లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మండలం మల్లికార్జుననగర్ కు చెందిన తోటపల్లి రాజు ఇటీవలి కాజీ పేట రైల్వే పరిసర ప్రాంతాల నుంచి వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారంతో రాజును గు ర్తించి అరెస్ట్ చేసి, అతని నుంచి నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సైలు బి.శివ, తాళ్లపల్లి యాదగిరి, మౌనిక, క్రైం టీం సభ్యులు క్రాంతికుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


