మంచిర్యాలక్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫాలితాలనిస్తోంది. ఈ ఏడాది జూలై 1న జిల్లాలో ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ 31తో ముగిసింది. కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, ఎన్‌జీవో అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. 127 మంది బాలబాలికలను చెరవిడిపించి విముక్తి కల్పించారు. ఇటుక బట్టీలు, బేకరీలు, ఆటోస్టోర్స్, ఇళ్లల్లో పని చేస్తున్న వారిని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహల్లో చేర్పించారు. ఇందులో 102 మంది బాలలు, 25 మంది బాలికలు ఉన్నారు. ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు.


