మంచిర్యాలరూరల్(హాజీపూర్)/వేమనపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను శనివారం 19.950 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్ట్ నుంచి 5వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 285 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 15,750 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు మూసివేశారు. వేమనపల్లిలో ప్రాణహిత నది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ నిండుగా ప్రవహిస్తోంది.


