దండేపల్లి: సెల్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో దేశ, విదేశాల్లో ఉంటున్న మిత్రులు సైతం ప్రతీ రోజు మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం దూర ప్రాంతాల్లోని మిత్రులు తమ యోగక్షేమాలను ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలియజేసేవారు. దండేపల్లికి చెందిన బొమ్మెన మహేష్‌కు సంగారెడ్డిలో ఉండే తన చిన్ననాటి మిత్రుడు ప్రవీణ్‌కుమార్ 1996లో తన యోగాక్షేమాలతోపాటు మిత్రులు ఎలా ఉన్నారని తెలుసుకునేందుకు అప్పట్లో ఒక పోస్టుకార్డు రాశారు. ఆ పోస్టుకార్డును స్నేహానికి ప్రతీకగా ఇప్పటికీ భద్రపర్చానని, దానిని చూసిన ప్రతీసారి తన మిత్రుడితోపాటు బాల్యం గుర్తుకు వస్తుందని మహేష్ తెలిపాడు.


