ఆపదలో ఆపన్నహస్తం | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆపన్నహస్తం

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

జన్నారం: జన్నారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1991–92 విద్యాసంవత్సరం మండలంతోపాటు పరిసర గ్రామాల వారు చదివారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇప్పటికీ విద్యార్థులంతా కలుస్తుంటారు. రేండ్లగూడకు చెందిన ఓ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా.. అతడి కూతురు వివాహానికి కొంత సహాయం అందించారు. చర్లపల్లి గ్రామంలో మరో స్నేహితుడు మృతిచెందగా కుటుంబ సభ్యులకు కొంత సహాయం చేశారు. ఇటీవల పొనకల్‌కు చెందిన స్నేహితుడు అనారోగ్యంతో మృతిచెందగా రూ.31 వేలు అందజేసి కుటుంబానికి ధైర్యం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement