చెన్నూర్: మాది యాభై ఏళ్ల స్నేహం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ల్లో నేను గస్తీ నూరియా అనే స్నేహితుడు ఇద్దరం కలిసి చదువుకున్నం. చిన్ననాటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మాట ల్లో చెప్పాలేం. నూరియా నాకు ఏమైన సమస్య వస్తే భుజం మీద చెయ్యి వేయడమే కాదు. నీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చి ముందు ఉండేవాడు. నూరియా ఇండస్ట్రీయలిస్ట్. నేను మంత్రి అయినా సమయం దొరికితే కలుసుకుంటాం. మేమిద్దరం కలిస్తే సమయం ఏర్పడదు. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత బాధ్యత పెరిగింది. పండుగ వేడుకలు, ఇతర శుభకార్యాల్లో కలుసుకుంటాం. మేమిద్దరం కలిస్తే చిన్ననాటి ముచ్చట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం. స్నేహం మంచి కోరిదిగా ఉండాలే తప్ప స్వార్థంతో చేసేది కాదు. ప్రస్తుతం యువత స్నేహం పేరుతో మోసాలకు గురవుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌తో మోసపోతున్నారు. ఫేస్‌బుక్‌లో ఆకర్షితులై స్నేహం చేసి మోసపోవద్దు. యువత జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి.


