మణుగూరు బ్లాక్‌ సింగరేణికి కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

మణుగూరు బ్లాక్‌ సింగరేణికి కేటాయించాలి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

నస్పూర్‌: మణుగూరు డీప్‌ సైడ్‌ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఐఎన్‌టీయూసీ నాయకులు శనివారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జనక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మణుగూరు డీప్‌ సైడ్‌ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తే సంస్థ, కార్మికుల భవిష్యత్‌, ఉద్యోగాల కల్పనకు మరింత భరోసా కలుగుతుందని అన్నారు. బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, చీఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్‌, కేంద్ర నాయకులు సీహెచ్‌.భీంరావు, గరిగ స్వా మి, పి.తిరుపతి రాజు, పేరం రమేశ్‌, జీవన్‌ జోయ ల్‌, రవీందర్‌రెడ్డి, ల్యాగాల శ్రీనివాస్‌, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement