నెన్నెల: గ్రామాల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన రహదారుల నిర్మాణమే ప్రధాన ఆధారమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం జోగాపూర్ టీ రోడ్డు నుంచి మైలారం మత్తడి వాగు బ్రిడ్జి వరకు రూ.1.70 కోట్లతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు హరీష్‌గౌడ్, నాయకులు తోట శ్రీనివాస్, మల్లాగౌడ్, శంకరయ్య, గట్టు శివలింగయ్య, రాజ్‌కుమార్, గజేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నార్వాయిపేట గ్రామ సర్పంచ్ కున్సోతు నారాయణ మాజీ ఎంపీపీ తారాచంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు.


