మంచిర్యాలఅగ్రికల్చర్: బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామ్‌మోహన్‌రెడ్డి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోషా, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్(ఎకై ్సజ్) బి.కృష్ణతేజలతో కలిసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టంపై ఏర్పాటు చేసిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.


