సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని రాళ్లవాగు ఆక్రమణలతో కుంచించుకుపోతోంది. వరదల సమయంలో ఆక్రమణ నిర్మాణాలపై హడావుడి చేస్తూ ఆ తర్వాత అంతా మర్చిపోవడంతో ఇబ్బంది తలెత్తుతోంది. ఇప్పటికే ఈ వాగుకు ఇరువైపులా కోర్, బఫర్ జోన్ తేడా లేకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు. కొందరు తమ భూమి వాగు వరకు ఉందంటూ కాగితాలపై చూపిస్తూ వాగులోనే మట్టి, బండలతో నింపేస్తూ చదును చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో కొద్దిపాటి వరదకు లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోంది. గోదావరి పూర్తి స్థాయిలో నిండితే రాళ్లవాగు వరద వెనక్కి తట్టే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం గోదావరిలో వరద లేకపోవడంతో ఇంకా ముప్పు ఏర్పడలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కాలనీ, రామ్‌నగర్, పద్మశాలీకాలనీ, గ్రీన్‌సిటీ, రంగంపేట, పాత మంచిర్యాల, రాళ్లపేట కాలనీలకు నీరు చేరింది. అనేకమంది తమ ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
● రాళ్లవాగుకు ఇరువైపులా నిర్మాణాలు ● తొలగింపు లేకపోవడంతో అడ్డగోలుగా కబ్జాలు ● కోర్, బఫర్ తేడా లేకుండా వెలిసిన కట్టడాలు ● వానొస్తే సమీప ప్రాంతాలకు వరదతో వణుకు
Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM
● రాళ్లవాగుకు ఇరువైపులా నిర్మాణాలు ● తొలగింపు లేకపోవడంతో అడ్డగోలుగా కబ్జాలు ● కోర్, బఫర్ తేడా లేకుండా వెలిసిన కట్టడాలు ● వానొస్తే సమీప ప్రాంతాలకు వరదతో వణుకు
Advertisement


