విద్యారంగ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ అభివృద్ధికి కృషి

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

బెల్లంపల్లి: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం శాంతిఖనిబస్తీలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కలెక్టర్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్లు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని తహసీల్దార్‌ కృష్ణను ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో భూ భారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement