కందులు వేస్తే పందులపాలు | - | Sakshi
Sakshi News home page

కందులు వేస్తే పందులపాలు

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

నాకున్న ఆరెకరాల్లో ఏటా వరి సాగే చేస్తున్న. ఇప్పటికే వరినాట్లు వేసుకోవాల్సి ఉంది. వర్షాల్లేక వేయలేదు. నారు దొయ్యకు నీళ్లు పెట్టుకుంట కాపాడుకుంటూ వస్తున్నా. వరి సాగు వద్దు.. కందుల పంట వేయమంటున్నారు. అవే వేస్తే పందులు, కోతులు దక్కనియ్యవు. వానాకాలం ముందట పెసల్లు వేస్తే కోతులు ఒక్క కాయ లేకుండా చేసినయి. వానలు లేకుంటే అట్ల నష్టం. ఈ పంటలు వేస్తే ఇట్ల నష్టపోవాల్సి వస్తుంది.

– రావుల రాజన్న, గ్రామం: పెద్దంపేట్‌,

మం: హాజీపూర్‌

మరే పంట వేయలేం..

వానాకాలం, యాసంగిలో వరి సాగు చేస్తున్న. ఇతర పంటలు వేస్తే అటవీ జంతువులు కోతులు, పందులు దక్కనియ్యవు. ఇప్పటికే నారు పోసుకుని ఇరువై రోజులైంది. వానలు లేవు. దొయ్యల్ల నీళ్లు లేక నాట్లు వేస్తలేము. నారు ముదిరిపోతుంది. ఈ యేడాది వానాకాలం పంట సాగు కష్టమే ఉంది. – బెడద పోశం, గ్రామం: హాజీపూర్‌,

గడువు ముగిసింది..

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జూలై 16 నుంచి 31 వరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తనాలు మొలవని చోట విత్తనాలు వేసుకోవడం, వరినారు పోసుకున్న రైతులు భారీ వర్షాలు కురిస్తే నాట్లు వేసుకోవాలి. నారు పోసుకోని రైతులు ఇతర స్వల్పకాలిక కంది, రాగి, మొక్కజొన్న, అలసంద, ఉలువలు, జొన్న, కూరగాయల పంటలు సాగు చేసుకోవాలి.

– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement