మంచిర్యాలఅగ్రికల్చర్: ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించి బాల కార్మికులు, వీధి బాలలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గు ర్తించి తక్షణమే రక్షించేలా చూడాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్‌తో కలిసి హాజయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హోటళ్లు, దాబాలు, టీ స్టాళ్లు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, పరిశ్రమలు, ఇ టుక బట్టీలు, నిర్మాణ పనులు, షాపింగ్ సముదా యాలు, వ్యవసాయ క్షేత్రాలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గు ర్తించి వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించా రు. రక్షించిన ప్రతీ చిన్నారికి వైద్య పరీక్షలు, కౌన్సి లింగ్, విద్యలో పునఃప్రవేశం, కుటుంబ పునరావాసం, అవసరమైన బాలల సంరక్షణ సంస్థలో ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే య జమానులు, చిన్నారుల హక్కులను దుర్వినియో గం చేసే వ్యక్తులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, పోలీస్, కార్మిక, విద్య, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ యూ నిట్ చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు పాల్గొన్నారు.


