‘సర్‌’కు ఓటర్లు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు ఓటర్లు సహకరించాలి

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలటౌన్‌: ఓటర్ల సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్‌ ఫారాలు తప్పులు లేకుండా పూర్తి చేసి బీఎల్‌వోలకు ఈ నెల 19లోపు అందించడంలో సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం సర్‌ ప్రక్రియలో ఓటు హక్కును కోల్పోతే జరిగే ప్రమాదంపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేందుకు ఓటు హక్కు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్‌ దర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్‌, పెంట రజిత, గజ్జెల హేమలత, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement