నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గని బాట | - | Sakshi
Sakshi News home page

నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గని బాట

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

శ్రీరాంపూర్‌: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి శ్రీరాంపూర్‌కు రానున్నారు. సింగరేణి భరో సా యాత్రలో భాగంగా మంగళవారం ఆయన ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3 గనిని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.30గంటలకు గనికి చేరుకుని కార్మికులతో మాట్లాడుతారు. ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఎంఎస్‌ ఇతర నాయకులు హాజరవుతారు. తాడిచెర్ల బొగ్గుబ్లాక్‌ 2ను సింగరేణికి కేటాయించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పార్టీ నాయకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement