అనారోగ్య సమస్యలతో ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో ఒకరు..

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

రెబ్బెన: అనారోగ్య సమస్యలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంగాపూర్‌కు చెందిన అనిశెట్టి శ్రీనివాస్‌ (50) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు హైబీపీతో బాధపడుతున్నాడు. నెలరోజులుగా మతిస్తిమితం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున అతని భార్య నిద్రలేచి చూడగా శ్రీనివాస్‌ మంచంలో కనిపించలేదు. అతనికోసం గాలిస్తుండగా గంగాపూర్‌ వాగువైపు వెళ్లినట్లు గ్రామానికి చెందిన అనిశెట్టి సత్తయ్య, అనిశెట్టి హరీష్‌ తెలిపారు. అక్కడికి వెళ్లి చూడగా గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బలవన్మరణం

సిరికొండ: ఆర్థిక ఇబ్బందులతో ఒకర ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పూజ తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాంపూర్‌ గూడకు చెందిన రోజువారి కూలీ పవార్‌ రాము(45) బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. భార్యను నిద్రలేపి ఆర్థిక ఇబ్బందులతో నాకు నిద్రరావడంలేదని, దీంతో పురుగుల మందు తాగినట్లు తెలిపాడు. వెంటనే చుట్టుపక్కల వారి సాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య పవార్‌ అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

తిమ్మాపూర్‌లో వ్యక్తి మృతి

లక్సెట్టిపేట: మండలంలోని తిమ్మాపూర్‌లో ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కాండ్రపు తిరుపతి (48)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం కుటుంబ కలహాలతో అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 4న తన తల్లి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మృతుని తల్లి, పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని ఎస్సై తెలిపారు. అతిగా మద్యం సేవించి సమయానికి అన్నం తినక మృతి చెంది ఉంటాడని అతని తల్లి కాండ్రపు రామక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

వృద్ధుడిపై యువకుల దాడి

మంచిర్యాలక్రైం: వంట కోసం కట్టెలు ఏరుకుంటున్న ఓ వృద్ధుడిపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసినట్లు ఎస్సై తిరుపతి తెలి పారు. రాజీవ్‌నగర్‌కు చెందిన గోలెటి లహాన్‌ మా డల్‌ స్కూల్‌ వెనుక కట్టెలు ఏరుకుంటుండగా గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి ఇది మా ఏరియా ఇక్కడ కట్టెలు ఎందుకు ఏరుతున్నావని అతనిపై కర్రలతో దాడిచేసి పారిపోయారు. లహాన్‌కు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు గమనించి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా సదరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణ

పాతమంచిర్యాల: దేశంలోని విద్యావంతులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం కింద వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు 6 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.9వేల స్టైఫండ్‌, రూ.6వేల గ్రాంట్‌తో పాటు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమాయోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన సౌకర్యాలు కల్పిస్తారు. పదోతరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తిచేసి 18 నుంచి 25 ఏళ్లలోపువారు అర్హులన్నారు. ప్రస్తుతం బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా, బీఈ, బీటెక్‌ చదివిన వారు, పోస్టు గ్రాడ్యుయేట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వారు, దూరవిద్య చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు prime minister internship scheme పోర్టల్‌ను సందర్శించాలని, లేదా 1800 11 6090 టోల్‌ఫ్రీ నంబర్‌లో లేదా కలెక్టరేట్‌లోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో సంప్రదించాలని

సూచించారు.

ఒకరికి ఆరురోజుల జైలు

నర్సాపూర్‌ (జి): మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి కోర్టు బుధవారం ఆరురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు. 2022లో ముధోల్‌ మండలం ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన సుంక ప్రవీణ్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుడిని బుధవారం సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నర్సయ్య ఎదుట హాజరు పర్చగా పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement