మంచిర్యాలఅర్బన్:పదో తరగతి వార్షిక పరీక్షలకు పది రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జి ల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 37,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నా రు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా ఉ పాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా రు. స్లిప్ టెస్ట్‌లు, ఫ్రీఫైనల్ పరీక్షలు పూర్తి చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయు లు మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల వేళ విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చదివితే ఫలితాలు ‘పది’లంగా ఉంటాయని ఆయా సబ్జెక్టుల నిపుణులు ఇలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


