వేమనపల్లి: ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినం రోజునే నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో అడవి పందిని వేటాడినట్లు నీల్వాయి అటవీ రేంజ్ అధికారి హఫీజోద్దీన్ తెలిపారు. కేతనపల్లికి చెందిన నెండుగూరి నారాయణ, గురుండ్ల వసంత్, నిక్కూరి బాపు పెద్దవాగు సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవిపందిని హతమార్చారు. అక్కడే ముక్కలుగా కోసి ఇంటికి వచ్చి కూరవండుకున్నారు. పక్కా సమాచా రంతో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్ కుమార్, ఎఫ్‌బీవో మహిపాల్ బేస్ క్యాంప్ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


