ఆదిలాబాద్‌టౌన్: హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. విద్యానగర్‌కు చెందిన ప్రకాష్ జైస్వాల్ అలియాస్ బాలు కొంతకాలంగా బొక్కలగూడకు చెందిన ఉమర్ ఖలీల్‌తో కలిసి రి యల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలతో ఇద్దరి మధ్య మనస్పర్థాలు చోటుచేసుకున్నాయి. సోమవారం సాయంత్రం ఉ మర్ ఖలీల్, వసీమ్ కోకర్ విద్యానగర్‌లో బాధితుడి పై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి కత్తి తో పాటు రెండు ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


