దండేపల్లి: ఆస్తి పంపకాల విషయంలో న్యా యం జరుగుతుందో లేదోనని మనస్తాపంతో పురుగుల మందు తా గి యువకుడు ఆత్మహత్య చే సుకున్న సంఘటన మండలంలో చోటు చే సుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలి పిన వివరా ల మేరకు జన్నారం మండలం చింతలపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బినవేని రవి (23) కొ ద్దిరోజులుగా తన అమ్మమ్మ గారి ఊరైన దండేపల్లి మండలంలోని శ్రీరాములపల్లెలో తల్లి కొ మురక్కతో ఉంటున్నాడు. స్వగ్రామం చింతలపల్లిలో ఉన్న ఆస్తి విషయంలో బంధువులతో వి వాదం నెలకొంది. తనకు రావాల్సిన ఆస్తి దక్కుతుందో లేదోనని గత నెల 27న పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించగా చికి త్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. మృతుని తల్లి కొమురక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


