షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

కోటపల్లి: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అన్నారంలో తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇంట్లో శారద, అంజలి అనే ఇద్దరు మహిళలు కిరాయికి ఉంటున్నారు. మంగళవారం ఇద్దరూ కూలీ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఎస్సై రాజశేఖర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనలో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement