వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

ఖానాపూర్‌: అదుపుతప్పి కారు బావిలోకి దూసుకెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని నర్సాపూర్‌ గ్రామానికి చెందిన భూక్య శ్రీనివాస్‌ (40) ఖానాపూర్‌లోని గ్రోమోర్‌ ఫర్టిలైజర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న శ్రీరాముల రవిని రంగపేటలో దించి వస్తుండగా బీర్నంది గ్రామ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బోడ మల్లేశ్‌కు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. దీంతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య భారతి, కుమారుడు విష్ణువర్థన్‌, కుమార్తె వైష్ణవి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement