ఆటోల చోరీ ముఠా అరెస్ట్
● 27 వాహనాలు స్వాధీనం
● ఐదుగురి అరెస్ట్.. పరారీలో ఇద్దరు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ
ఆదిలాబాద్‌టౌన్: ఆటోల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 ఆటోలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ పోలీస్‌స్టేషన్ పరి ధిలోని రాంపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనా ల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో నిందితుడు షారూక్ పఠాన్ తాను దొంగిలించిన ఆటోలతో వెళ్తూ పోలీసులను చూసి పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా ఏడుగురు ముఠాగా ఏర్పడి ఆటోలు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకొన్నాడు. హైదరాబాద్‌లో ఆటోలను దొంగిలించి వాహన, ఇంజన్ నంబర్లు మార్చి వాటి స్థానంలో నకిలీ నంబర్లు ముద్రించి అమ్మడానికి సిద్ధంగా ఉంచిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో నార్నూర్‌కు చెందిన ఏ–1 యూసుఫ్ ప్రస్తుతం కేఆర్‌కే కాలనీలో ఉంటున్నాడు. ఈయన పరారీలో ఉండగా, జైనూర్‌కు చెందిన ఏ–2 సయ్యద్ పరారీలో ఉన్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్‌కు చెందిన ఏ–3 షారూ క్ పఠాన్, అదే కాలనీకి చెందిన ఏ–4 అల్తాఫ్ ఖాన్, నార్నూర్ మండలంలోని నాగల్‌కొండకు చెందిన ఏ–5 షేక్ ఖయ్యూం, అదే గ్రామానికి చెందిన ఏ–6 అఫ్సర్ బేగ్, మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహో ర్ తాలుకా గొండ్వర్సకు చెందిన ఏ–7 అసద్ ఖాన్ ఉన్నట్లు తెలిపారు. ఏ–1, ఏ–2 పరారీలో ఉండగా, మిగతావారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 27 ఆటోలకు సంబంధించిన వివరాలు తెలియగా, తొమ్మిది ఆటోల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఆటోల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.27లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఏ–1, ఏ–2ను పట్టుకోవడానికి ప్రత్యే క బృందాలను నియమించినట్లు ఎస్పీ చెప్పారు. ఎవరైనా పాత వాహనాలు అమ్మడానికి వచ్చినప్పుడు వాటి ఒరిజినల్ ఆర్సీ, చేసిస్, ఇంజన్ నంబర్లు చూసి కొనుగోలు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


