పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా.. | - | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా..

Nov 5 2023 1:18 AM | Updated on Nov 5 2023 9:47 AM

- - Sakshi

ద్విచక్ర వాహనంపై ప్రచారం బోర్డు

సాక్షి, కరీంనగర్/మంచిర్యాల: ఓటు హక్కు వినియోగంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డుకు చెందిన అందె సంతోశ్‌బాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ‘‘నా ఓటును అమ్ముకుంటాను.. నాకు సిగ్గులేదు, ఉద్యోగాలు, ఉపాధి అవసరం లేదు, మద్యానికి బిర్యాని, డబ్బులకు అమ్ముడుపోతాను, నాకు సిగ్గులేదు’’ అని ఓ బోర్డును తయారు చేసి తన ద్విచక్ర వాహనం వెనుకాల అమర్చాడు. వాహనంపైనే పట్టణంలో పర్యటిస్తున్నాడు. ప్రజలు పాజిటివ్‌గా చెబితే అర్థం చేసుకోవడం లేదని, ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నట్లు సంతోశ్‌బాబు చెప్పాడు. జాతీయ దారిద్య్ర రేఖ దిగువ ప్రజల హక్కుల పోరాట సమితిని ఇటీవల స్థాపించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు.
ఇవి చదవండి: మావోయిస్ట్‌ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్‌..!

Advertisement
 
Advertisement
Advertisement