త్వరలో టేకుమట్ల వాగుపై బ్రిడ్జి పనులు | - | Sakshi
Sakshi News home page

త్వరలో టేకుమట్ల వాగుపై బ్రిడ్జి పనులు

Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM

జైపూర్‌: టేకుమట్ల పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఇప్పటికే రూ.7కోట్లతో టెండర్‌ పూర్తయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి తెలిపారు. మండలంలోని టేకుమట్ల వాగు వద్ద శుక్రవారం వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. నీటి ప్రవాహం, 11గ్రామాలకు రాకపోకలు సాగించే రోడ్డు మార్గంలో బ్రిడ్జి ప్రాముఖ్యతను స్థానిక నాయకులు మంత్రికి వివరించారు. డీసీసీ ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యర్శిఽ గోనె నర్సయ్య, సర్పంచ్‌ బల్ల వెంకటేశ్‌, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement