మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) సరఫరా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. శుక్రవారం హాజీపూర్‌లోని ఎస్‌ఆర్‌ఎం రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ సీఎంఆర్‌ను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రభుత్వానికి అ ప్పగించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయడం ప్రతీ మిల్లర్ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మండల గిర్దావర్ ప్రభు, మిల్లుల యాజమాన్యం పాల్గొన్నారు.


