మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్యూమరేషన్ ఫారా ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ తర్వాత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, ధ్రువపత్రాలు సమర్పించడం ద్వారా ఓటు హక్కును పొందవచ్చని తెలిపారు. డబుల్, డెత్, షిఫ్ట్ అయిన వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


