మంచిర్యాలటౌన్: అప్పుడే పుట్టిన బిడ్డకు ఎదిగే వరకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేష్టమైనదని, ఆరోగ్యకరంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్‌రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతపై ఈ నెల ఒకటి నుంచి ఏడు వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలతోపాటు, బస్తీ దవాఖానా, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సూపరింటెండెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, డీపీవో ప్రశాంతి, బసుమతి, సుమన్ పాల్గొన్నారు.


