పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా యూజీసీ గైడ్‌లైన్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పరిశోధన పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తాం. గతంలో పోల్చితే యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీట్లు చాలా వరకు పెరిగాయి. పీహెచ్‌డీ కోసం త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి.. యూనివర్సిటీలో రీసెర్చికి పెద్దపీట వేస్తాం.
– ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూ
పీహెచ్‌డీ రెగ్యులేషన్స్ విడుదల చేశాం
పీయూతోపాటు పీజీ సెంటర్లకు సంబంధించి పీహెచ్‌డీ రెగ్యులేషన్స్ శుక్రవారం విడుదల చేశాం. యూనివర్సిటీలో ప్రొఫెసర్ల సంఖ్య పెరగడంతో పీహెచ్‌డీ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. ఎంవీఎస్ కళాశాలకు రీసెర్చ్ సెంటర్‌గా అవకాశం కల్పించాం. దీనికి కూడా పీహెచ్‌డీ సీట్లు వస్తాయి. యూనివర్సిటీ విడుదల చేసే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌లో సీట్లు చాలా వరకు పెరిగాయి. దీంతో యూనివర్సిటీలో పరిశోధనలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. – చంద్రకిరణ్, డైరెక్టర్, ఆడిట్ సెల్, పీయూ
●


