ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఈనెల 16న మానవపాడు మండ లం కొర్విపాడుకు చెందిన పరమేశ్‌గౌడ్(32) కుంటుంబ కలహాలతో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కలవారు చూసి పరిశీలించి 108 అంబులెన్స్‌లో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందడంతో తండ్రి మద్దిలేటిగౌడ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తి మృతిపై
కేసు నమోదు
ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు శివారులోని పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు చూసి కుల్లిన శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యక్తి శరీర భాగాల్లో ఉన్న దుస్తులు, వాహనాలను పరిశీలించడంతో వాహనం వివరాలను సేకరించి పరిశీలించగా.. కర్నూల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కర్నూల్ పట్టణం గడ్డమీదకు చెందిన హనీఫ్(66)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుదేహం అక్కడ 10రోజులుగా ఉండి కుల్లిపోయినట్లు తెలిపారు. మృతుదేహాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులకు అప్పగించి కుమారుడు సాజీద్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
రేషన్ డీలర్‌పై కేసు నమోదు
గోపాల్‌పేట: రేషన్ దుకాణా నిర్వహణ విషయంలో స్టాక్ తేడా రావడంతో రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసిన ఘటన ఏదుట్లలో చోటుచేసుకుంది. అధికారులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని ఏదుట్లకు చెందిన 14వ రేషన్ దుకాణంలో ఇటీవల సివిల్ సప్‌లై్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివరాలు సేకరించి వెళ్లారు. తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఏదుట్లలోని 14వ రేషన్ దుకాణంలో సివిల్‌సప్‌లై అధికారి పరమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ప్రస్తుతమున్న స్టాక్, రేషన్ పంపిణీ మిషన్‌లో అధికారికంగా ఉన్న సరుకులను అధికారులు అంచనా వేయగా.. మొత్తం సుమారు 54 క్వింటాళ్ల వరకు తేడా వచ్చింది. దీంతో డీలర్ భారతమ్మపై కేసు నమోదు చేసినట్లు గోపాల్‌పేట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి నిర్ధారించారు. ఇకపై డీలర్లు జాగ్రత్త వహించాలని తేడాలుంటే సహించేదిలేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ చెస్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల చెస్ పోటీలతో పాటు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ అండర్–17 విభాగంలో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 25వ తేదీన నాగర్‌కర్నూల్‌లో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా అండర్–14 విభాగంలో గెలుపొందిన విద్యార్థులు గద్వాలలో త్వరలో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాల్‌రాజు, నర్సింహారెడ్డి, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


