దేవరకద్ర రూరల్: శ్రీశ్రీశ్రీ చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం నిర్వహించిన వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 65 డీడీలు రావడంతో టెండర్దారుల మధ్య పోటీ నెలకొంది. నాలుగు విభాగాలకు కలిపి రూ.17.12 లక్షల అదాయం వచ్చింది. ఈసారి తలవెంట్రుకల వేలం అత్యధికంగా రూ.7.71 లక్షలు పలుకగా కోన రాజశేఖర్ దక్కించుకున్నారు. టెంకాయల వేలం రూ.4.02 లక్షలకు శ్రీనివాసులు, లడ్డు, పులిహోర ప్రసాదాల వేలాన్ని నత్తి కుర్మయ్య రూ.3.65 లక్షలకు, కొబ్బరిచిప్పల వేలాన్ని హనుమంతు రూ.1.74 లక్షలకు దక్కించుకున్నారు.గతేడాది కంటే ఈసారి ఆలయానికి రూ.7.63 లక్షలు అదనంగా సమకూరాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, టెండర్దారులు పాల్గొన్నారు.


