రైతులకు నీళ్లడిగితే అరెస్టులా? | - | Sakshi
Sakshi News home page

రైతులకు నీళ్లడిగితే అరెస్టులా?

Sep 22 2026 12:48 AM | Updated on Sep 22 2026 12:48 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నందున సాగునీరు విడుదల చేయాలని కోరిన బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం ఖండించారు. రైతుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి 660 కిలోమీటర్ల దూరంలో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పానికి కృష్ణా జలాలను తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరు రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ, మాల్యా ల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 100 టీఎంసీలకు పైగా నీటిని ఏపీకి తరలిస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించి, నాయకులు, రైతులను అదుపులోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలలో 8.8 టీఎంసీల నీరు ఉందని, తాగునీటికి 2 టీఎంసీలు కేటాయించినా వారబందీ విధానంలో సాగునీరు విడుదల చేసి లక్ష ఎకరాల పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున పాలమూరు రైతుల కోసం కనీసం 5 టీఎంసీల నీటిని తీసుకురాలేరా అని ప్రశ్నించారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement