ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

Sep 22 2026 12:48 AM | Updated on Sep 22 2026 12:48 AM

మరికల్‌: కోయిల్‌సాగర్‌ నీటి విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం నారాయణపేట జిల్లా మరికల్‌లో జాతీయ రహదారిపై ధర్నా చేస్తుండగా మహబూబ్‌నగర్‌ నుంచి మక్తల్‌ వెళ్తున్న ఎంపీ డీకే అరుణ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా ఉండి కోయిల్‌సాగర్‌ నీటి విడుదలకు సహకరించాలని ఎంపీ కారును బీఆర్‌ఎస్‌ శ్రేణులు చుట్టుముట్టారు. వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో నీళ్లు వదాలకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆమెకు వివరించారు. ఎంపీ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆమె కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జ్యోకం చేసుకొని పరిస్థితి చేయి దాటిపోకుండా ఆందోళనకారులను పక్కకు తోసివేసి ఎంపీ కాన్వాయ్‌ ముందుకు కదిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement