ప్రతి నెలా ఇతరులను అడగాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతి నెలా ఇతరులను అడగాల్సిందే..

Sep 13 2026 1:12 AM | Updated on Sep 13 2026 1:12 AM

పెళ్లయి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి హెచ్‌పీ గ్యాస్‌నే వినియోగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఒకే గ్యాస్‌ కుండతో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం కుటుంబం విడిపోయి వేరుగా ఉంటున్నాం. దీంతో వంటకు గ్యాస్‌ అవసరం పెరిగింది. అదనంగా మరో గ్యాస్‌ కుండ ఇవ్వాలని సంబంధిత ఏజెన్సీని అడిగినా స్పందించడం లేదు. ఒకే కుండ ఉండటంతో అది ఖాళీ అయిన ప్రతిసారీ కొత్త కుండ వచ్చేవరకు వంట చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. వంట ఆగిపోకుండా ఉండేందుకు ప్రతి నెలా బంధువులు, పరిచయస్తుల వద్ద గ్యాస్‌ కుండ కోసం అడగాల్సి వస్తోంది.

– పి.నారాయణమ్మ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement