వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన చేతుల మీదుగా వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, వారిలో నైతిక విలువలు పెంపొందించడం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో చూపిన సేవలను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. – సాక్షి నెట్‌వర్క్


