కలుపు నివారణతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

కలుపు నివారణతో అధిక దిగుబడి

Sep 6 2026 1:13 AM | Updated on Sep 6 2026 1:13 AM

నాటిన 25–35 రోజుల మధ్య

వెడల్పాకు కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే పొలంలో నీరు తీసేసి ఎకరానికి 400 గ్రాముల 2,4, డీ సోడియం సాల్ట్‌ను లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

అలంపూర్‌ : వరితో సహా ఏ పంటలోనైనా దిగుబడిపై ప్రభావితం చూపేది కలుపు. కలుపు వలన దాదాపు 35 శాతం పంట నష్టం జరుగుతుందని ఏంఏఓ నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. సరైన సమయంలో కలుపును నివారించకపోతే 40 శాతం వరకు దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. వరిలో కలుపు నివారణ చర్యలను ఈ విధంగా వివరించారు.

నాటిన 3 నుంచి 5వ రోజు మధ్య :

వరి నాటిన 3 లేక 5 రోజులలోపు పొలంలో 3 నుంచి 5 సెంటిమీటర్ల నీటిని నిల్వ ఉంచి ఎకరానికి 4 కిలోల 2, 4 డీ ఇౖథైల్‌ ఎస్టర్‌ లేదా 4 కిలోల బ్యూటక్లోర్‌ గుళికల్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతట సమానంగా పడే విధంగా చల్లాలి. లేదా లీటర్‌ నీటికి 35 గ్రాముల ఆక్సిడయార్జిల్‌ లేదా 80 గ్రాముల పైరజో సల్ఫురాన్‌ ఇథలైన్‌ కలిపి ఆ తర్వాత దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంత సమానంగా పడేలా చల్లాలి. పొలం అంత పలుచగా నీరు పెట్టి వీటిని చల్లుకోవాలి. ఈ మందులు చల్లిన రెండు మూడు రోజుల వరకు పొలంలోని నీరు బయటికి పోకుండా బయటి నీరు లోపలికి రాకుండా చూడాలి.

గడ్డి జాతీ మొక్కలు (ప్రత్యేకించి ఊద ఎక్కువగా ఉంటే) :

ఎకరానికి 500 మి.లీ అనిలోఫాస్‌ లేదా 500 మి.లీ ప్రిటిలాక్లోర్‌ లేదా 1.5 లీటర్ల బెంధియోకార్ప్‌ను 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో పలుచగా నీరు ఉంచి పొలం అంత సమానంగా పడేటట్లు చల్లాలి.

నాటిన 8–12 రోజుల్లో

ఎకరానికి 37.5 మి.లీ ఫెనాక్సులమ్‌ను బురద పదునులో పిచికారీ చేసి మరుసటి రోజు తేలిక పాటి నీరు పెట్టాలి. గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు ఉపయోగపడుతుంది.

నాటిన 15–20 రోజుల మధ్య :

నాట్లు వేసిన 3–5 రోజుల లోపుగాని 8–12 రోజుల లోపుగాని కలుపు మందుల వాడకం కుదరనప్పుడు 15–20 రోజుల మద్య మందుల ద్వారా కలుపు నివారించవచ్చును. గడ్డి జాతి వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే పొలం నుంచి నీటిని తీసి ఎకరానికి 80–100 మి.లీ బిస్‌పైరి బాక్‌సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ఉత్తమం.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement