రూ 3.80కోట్ల ధాన్యం మాయం | - | Sakshi
Sakshi News home page

రూ 3.80కోట్ల ధాన్యం మాయం

Sep 6 2026 1:13 AM | Updated on Sep 6 2026 1:13 AM

వనపర్తి రూరల్‌: మండలంలోని చిమనగుంటపల్లి శివారులోని బాలజీ రైసుమిల్లులో శనివారం సివిల్‌ సప్లయి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ పరమేష్‌ అండ్‌ సీసీఎస్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కలసి తనిఖీ నిర్వహించగా.. 37,118 బస్తాల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ పరమేష్‌ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని చిమనగుంటపల్లి శివారు బాలాజీ రైసుమిల్లుకు 2023–24 వానకాలం సీజన్‌లో వరి ధాన్యం 40 కేజీల బ్యాగులు 72,061 కేటాయించామని తెలిపారు. వీటిలో 9ఏసీకేల రైస్‌ సీఎంఆర్‌ ఇవ్వడం జరిగందని, మిగతాత 62,423 బస్తాలు రైతుమిల్లులో ఉండాలి. కాని 25,305 బస్తాల ధాన్యం మాత్రమే అందుబాటులో ఉందని, మిగతా 37, 118 బస్తాల ధా న్యం మాయమైన ట్లు గుర్తించారు. అట్టి ధాన్యం విలువ రూ 3.80కోట్లు ఉంటదని తెలిపారు. అధికారుల సూచనల మేరకు చర్య లు ఉంటాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement