● భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
● మహబూబ్‌నగర్‌లో ముస్లింల భారీ ఊరేగింపు
స్టేషన్ మహబూబ్‌నగర్: మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ఊరేగింపు నిర్వహించారు. అసర్ నమాజు అనంతరం వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన వారు క్లాక్‌టవర్ నుంచి ర్యాలీగా బయలుదేరి అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, న్యూటౌన్ మీదుగా షాసాబ్‌గుట్ట దర్గా వరకు చేరుకున్నారు. అనంతరం దర్గా ఆవరణలో పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్‌షా ఖాద్రీ అధ్యక్షతన ధార్మిక సభ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అల్లమా సయ్యద్ అలంగీర్ అష్రఫ్ అష్రఫీ, జామియా నిజామియాకు చెందిన మౌలానా ముఫ్తి మహ్మద్ హుస్సేన్ ఖురేషి ధార్మిక సందేశాలు ఇచ్చారు.
ఖౌమీ ఏక్తా కమిటీ స్వాగతం
అంబేద్కర్ చౌరస్తాలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్‌రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్‌చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్, చంద్రకుమార్‌గౌడ్, ఆనంద్‌కుమార్‌గౌడ్ ఊరేగింపునకు స్వాగ తం పలికారు. ఊరేగింపు ర్యాలీలో పలు సంస్థలవారు షర్బత్, నీళ్లు అందజేశారు. పలువురు నిర్వాహకులు, సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్న వారికి షర్బత్, నీటిని అందించారు. ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీక్ పటేల్, మజహర్ షహీద్, అఫ్రోజ్‌షా, మోసీన్‌ఖాన్, సాదుల్లా, జహీర్ అక్తర్, సిరాజ్‌ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.


