కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలి

Aug 27 2026 1:00 AM | Updated on Aug 27 2026 1:00 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, చిన్నచింతకుంట మండలం గూడూర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్‌ అఖ్తర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్‌, నాయకులు బెక్కరి మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, ఎన్‌పీ నేహశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement