జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా విష్ణునందన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా విష్ణునందన్‌

Aug 21 2026 7:51 AM | Updated on Aug 21 2026 7:51 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పి.విష్ణునందన్‌ గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంతో పాటు శాఖ కార్యక్రమాలను పారదర్శకంగా, నిబంధనల మేరకు అమలు చేస్తామన్నారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై శాఖ పరిధిలోని పథకాలు, విభాగాల పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ఉర్దూ అధికారి డాక్టర్‌ మునీబ్‌ అఫాఖ్‌, ఇతర సిబ్బంది విష్ణునందన్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement