ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ సమీపంలో చేప వంటకాలతో పాటు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొందరు యువకులు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలను అతివేగంగా నడపడంతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కుడి కాల్వ సమీపంలో చేప వంటకాలు అందుబాటులో ఉన్నా.. మద్యం విక్రయాలు లేకపోవడంతో యువత ప్రధానంగా ఎడమ కాల్వ వైపే వస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, సంబంధిత అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


