మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో బీఫార్మసీ, ఎంఈడీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలను వీ సీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఎంఈడీ మొదటి సెమిస్టర్‌లో 190 మందికి 140 మంది, మూడో సెమిస్టర్‌లో 91 మందికి 72 మంది, బీపీఈడీ మూడో సెమిస్టర్‌లో 145 మందికి 141 మంది, బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌లో 196 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఎంఈడీ ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, రవికాంత్, ఈశ్వర్‌కుమార్, సురేష్ పాల్గొన్నారు.
లా పరీక్షలను తనిఖీ చేసిన వీసీ
పీయూలో కొనసాగుతున్న లా పరీక్షలను వీసీ శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షకు 80 మంది హాజరు కావాల్సి ఉండగా 77 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రిన్సిపాల్ భూమయ్య పరీక్షలను పర్యవేక్షించారు.


