త్వరలోనే పునఃప్రారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక కొత్త బస్టాండులో ఈనెల 1 నుంచి కార్గో సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో సరుకుల రవాణాను కొత్త ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఎనిమిది రోజులైనా మహబూబ్‌నగర్‌లో ఈ ఏజెన్సీ ఇంకా నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో నిత్యం కొత్త బస్టాండుకు వ్యాపారులు, ప్రజలు వచ్చి సరుకుల బుకింగ్ లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు.
ఆరేళ్ల క్రితం ప్రారంభం..
మహబూబ్‌నగర్ కొత్త బస్టాండులో 2020 జూన్ 19న కార్గో సేవలను ఆర్టీసీ సంస్థ ప్రారంభించింది. సుమారు ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు అధికారులే చేపట్టారు. కరోనా అనంతరం టెండర్ విధానం అమలులోకి రాగా మూడేళ్లు ఒకరికి, రెండేళ్లు మరో ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రతిసారి నిబంధనలు మారుతున్నాయని సదరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితమే కాంట్రాక్టు పొందిన వ్యక్తి చివరకు ఈనెల 1 నుంచి తప్పుకొన్నారు. ప్రతినెలా రూ.1.35 లక్షల అద్దె ఆర్టీసీకి చెల్లించడం ఎంతో భారంగా మారిందని పేర్కొన్నారు. కాగా, నిత్యం రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు సరుకుల రవాణా ద్వారా లావాదేవీలు జరిగేవి. వాస్తవానికి ఆరేళ్ల క్రితమే ఇక్కడ ఆరంభమైన కార్గో సేవలు ఇప్పుడు కొత్త ఏజెన్సీకి మారడంతో మొదటిసారి నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజలు, వ్యాపారులు తమ సరుకులను ఆర్టీసీ బస్సుల ద్వారా పంపించే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కార్గో సేవలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానిక కొత్త బస్టాండులో ఈనెల 1 నుంచి కార్గో సే వలు నిలిచి పోయింది వా స్తవమే.ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి టెండ రు దక్కింది. సదరు నిర్వాహకులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఇక్కడ కార్గో సేవలు పునఃప్రారంభమయ్యేలా చూస్తాం.
– కె.అశోక్‌కుమార్,
డిపో మేనేజర్, మహబూబ్‌నగర్
ఆగస్టు 1 నుంచి కొత్త ఏజెన్సీకి అప్పగింత
ఏడాదికే తప్పుకొన్న పాత కాంట్రాక్టర్
ఆర్టీసీకి నెలకు షాపు
అద్దె రూ.1.35 లక్షలు
సరుకుల బుకింగ్ లేక తిరిగి వెళ్తున్న వ్యాపారులు
పాలమూరు కొత్త బస్టాండ్‌లో
ఇదీ పరిస్థితి


