గుడిలో ఉరివేసుకుని.. పూజారి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గుడిలో ఉరివేసుకుని.. పూజారి ఆత్మహత్య

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

మక్తల్‌: నిత్యం పూజలు చేసే గుడిలోనే ఓ పూజారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశి)కి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సౌరబ్‌మిశ్రా(23) ను ఆయన మిత్రుడు, వల్లభాపూర్‌ దత్తాత్రేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఉపేందర్‌ కొన్ని రోజుల క్రితం మక్తల్‌లోని శిరిడీ సాయిబాబ ఆలయంలో పూజారిగా పని చేసేందుకు రావాలని పిలిపించారు. మొదట వల్లభాపూర్‌లోని దత్తాత్రేయస్వామి ఆలయంలో స్నేహితుడితో కలిసి ఉన్న సౌరబ్‌మిశ్రా ఆ తర్వాత మక్తల్‌ శిరిడీ సాయిబాబ ఆలయంలో పూజలు నిర్వర్తిస్తూ.. ఆలయం పక్కనే ఉన్న ఓ గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సౌరబ్‌మిశ్రా సో మవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడి.. ఆ తర్వాత గుడిలోనే ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని మిత్రుడు ఉపేందర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయనకు వివాహం కాలేదు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మక్తల్‌ ఎస్‌ఐ రాజు తెలిపారు. అయితే సౌరబ్‌మిశ్రా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఆస్పత్రికి వెళ్తూ..

అనంతలోకాలకు..

దేవరకద్ర రూరల్‌: కడుపునొప్పి చికిత్స కోసం స్నేహితుడితో కలిసి బైక్‌పై బయలుదేరి, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి యువకుడు మృతిచెందిన ఘటన సో మవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని గోప్లాపూర్‌కు చెందిన సాయిరాం (28)కు శనివారం కడుపులో నొప్పి రావడంతో చికిత్స కోసం దేవరకద్రలోని ఆస్పత్రికి వెళ్తుండగా.. మార్గమాధ్యంలో ప్రమాదవశత్తూ బైక్‌పై నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

పురుగు మందుతాగి

భర్త మృతి

మక్తల్‌: పురుగుల మందు తాగి భర్త మృతిచెందిన ఘటన మక్తల్‌ మండలంలోని కాట్రేవ్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ నర్సింహ భార్యాభర్తల మధ్య గొ డవతో మాటకుమాట పెరిగింది. భ్యార్యను భ యపెట్టిద్దామని నర్సింహ గతనెల 21న ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగడంతో వెంటనే కటుంబ సభ్యులు చికిత్సకోసం తరలించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. మృతుడు తండ్రి కుర్వ మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

తాళం వేసిన ఇంటికి కన్నం

నవాబుపేట: ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇంటిని చోరీ చేసి బంగారు, నగదు తదితర వస్తువులు చోరీచేసినట్లు బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని చిన్నమేగ్యతండాకు చెందిన సంతోష్‌నాయక్‌ వృత్తిరీత్యి ఆటోడ్రైవర్‌. ఆయన తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి గతనెల 27న హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈనెల 8వ తేదీన ఇంటికి వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. దీంతో గ్రామస్తులతో కలిసి ఇంట్లో వెతికితే బీరువా తాళం పగుల గొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న దాదాపు తులం బంగారం, 40 తులాల వెండి, నగదుతోపాటు టీవీ, గ్యాస్‌ సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన బిల్యానాయక్‌, ముడావత్‌ శ్రీనునాయక్‌పై అనుమానం ఉందని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement