జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమ వారం ప్రకటనలో పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు పాలమూరు జిల్లాకు అన్యాయం చేయడమే పనిగా పెట్టుకున్నాయని, తెలంగాణాకు అన్యా యం జరుగుతుంటే ఎంపీలు ఒక్క మాట మాట్లాడడం లేదని, తెలంగాణ నీటిహక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి కాలరాస్తున్నారన్నారు. కేంద్రం వెంటనే స్పందించి డీపీఆర్‌ను ఆమోదించాలని డిమాండ్ చేశారు.


