అడిగేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు?

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

సబ్‌ మీటర్‌ పెట్టుకోమని చెప్పాం..

డాక్టర్‌ సాయిని అంటూ...

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం

అడ్డంగా వాడేయి..
సీసీబీ నిర్మాణానికి ఏరియా ఆస్పత్రి కరెంట్‌

భవన నిర్మాణానికి కరెంట్‌ వినియోగించినా సబ్‌మీటర్‌ ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. నాలుగు నెలల కిందటే నేను చార్జ్‌ తీసుకున్నప్పుడే కాంట్రాక్టర్‌ను పిలిచి చెప్పా. అయినా అలాగే కరెంట్‌ వినియోగించారు. నిర్మాణం ప్రారంభించాక ప్రతి నెలా రూ.60 వేల నుంచి రూ.లక్ష బిల్లు ఎక్కువగా వచ్చింది వాస్తవమే. వచ్చిన బిల్లు ప్రతినెలా వైద్య విధాన పరిషత్‌కు పంపిస్తాం. మొత్తం రూ.70 లక్షలకు పైగా బిల్లు పెండింగ్‌లో ఉంది. నిర్మాణం కోసం వాడిన బిల్లును కడతామని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు.

– హర్షదుల్లా, సూపరింటెండెంట్‌,

ఏరియా ఆస్పత్రి, జడ్చర్ల

జడ్చర్ల టౌన్‌: పట్టణ శివా రులోని ఏరియా ఆస్ప త్రి వద్ద క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణం కో సం 19 నెలలుగా ఆ స్పత్రి కరెంట్‌ వినియోగిస్తున్నారు. ప్రతి నెలా దా దాపు రూ. లక్ష అదనపు బి ల్లు వస్తున్నావి ద్యుత్‌ శాఖ అధికారులు, ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవ డం లేదు. కరెంట్‌తో పాటు బోరు, మోటర్‌ సైతం వాడుతూ నీళ్లు ఆస్పత్రివే దర్జాగా వాడుతున్నా కాంట్రాక్టర్‌ను అడిగే వారెవరే లేరు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వివరణ కోరేందుకు విలేకర్లు వెళ్లగా నిర్మాణ పనులు ఆపేస్తానని కాంట్రాక్టర్‌ బెదిరించే యత్నం చేయగా, సాయి.. అనే నకిలీ డాక్టర్‌ మీకెందుకు బిల్లు మాఫీ అవుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. పూర్తి వివరాలిలా ఉన్నాయి.

కరెంట్‌, నీళ్లు అన్ని ఆస్పత్రివే..

కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ భవన నిర్మాణం కోసం విద్యుత్‌ శాఖ ద్వారా కరెంట్‌ మీటరు పొందాల్సి ఉంది. నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవా ల్సి ఉంటుంది. అయితే మీటరుకు దర ఖాస్తు చేసుకోకపోగా ఏరి యా ఆస్పత్రి మీటర్‌ నుంచి దర్జాగా కరెంట్‌ వినియోగిస్తున్నాడు. ఆస్పత్రి బోరు నుంచి నీటిని సైతం వినియోగిస్తుండటంతో ఆస్పత్రిలో తరచూ నీటి సమస్య ఏర్పడుతుంది. భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకముందు అంటే 2025 జనవరి 25 వరకు ప్రతి నెలా రూ.1.30 లక్ష ల నుంచి రూ.1.70 లక్షల దాకా బిల్లు వచ్చేది. నిర్మా ణ పనులు ప్రారంభం అయ్యాక అదనంగా రూ. లక్ష బిల్లు పెరిగింది. సుమారు గా రూ.2.60 లక్షల నుంచి రూ. 2.80 లక్షల వరకు బిల్లు వస్తుంది. ఇలా 18 నెలలుగా కరెంట్‌ బిల్లు నెలకు రూ. లక్ష చొప్పున రూ.17 లక్షల బిల్లు పెరిగిపోయింది. 2023లో ఆస్పత్రి వినియోగంలోకి రాగా అప్పటి నుంచి కరెంట్‌ బిల్లు మంజూరు కాలేదు. దీంతో ఆ గస్టు వరకు రూ.70 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ప్రతి నెలా వచ్చే బిల్లును వైద్య విధా న పరిషత్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి నిధులు విడుదలైతేనే బిల్లు చెల్లించటానికి ఆస్కారం ఉంది. అయితే ప్రతినెలా బిల్లు చెల్లించకపోవటంతో రుసు ము రూపంలోనూ విద్యుత్‌శాఖ బాదుతుంది. ఒకవై పు భవన నిర్మాణం కాంట్రాక్టర్‌ అక్రమంగా విని యోగిస్తున్న కరెంట్‌ బిల్లుతోపాటు రుసుముల పేరు తో బాదే బాదుడు వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. నాలుగు నెలల క్రితం సూపరింటెండెంట్‌గా ఉండి సస్పెన్షన్‌కు గురైన డా.చంద్రకళతో పాటు ప్రస్తుత ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డా.హర్షదుల్లాలు చర్యలు తీసుకోకపోవటం పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరెంట్‌ బిల్లు, నిర్మాణానికి వినియోగిస్తున్న విషయమై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను వివరణ కోరేందుకు శుక్రవారం కొందరు విలేకర్లు ఆస్పత్రికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ఇప్పుడేమైంది కరెంట్‌ వినియోగం చేసింది వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఇలా అయితే తాను ని ర్మాణమే ఆపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డా డు. అతనితో పాటే ఉన్న మరోవ్యక్తి తాను డాక్ట ర్‌ సాయినని, నెల రోజుల కిందటే ఆస్పత్రిలో చేరానని చెబుతూ బిల్లు ప్రభుత్వం మాఫీ చేస్తుందిలే అంటూ చెప్పుకొచ్చారు. తాము సూ పరింటెండెంట్‌ వివరణ కోసం వచ్చామని విలేకర్లు చెపుతూ వీడియో రికార్డింగ్‌ చేసేందుకు యత్నిస్తుండగా కాంట్రాక్టర్‌, నకిలీ డాక్టర్‌ లేచి వెళ్లిపోయారు.ఈ తతంగం కొనసాగుతున్న సమయంలో సూపరింటెండెంట్‌ మౌనంగా ఉ న్నారు. అయితే డాక్టర్‌ సాయి అనే వ్యక్తి ఎవరూ ఆస్పత్రిలో పనిచేయడం లేదన్న విషయం కొసమెరుపు.

బోరు, మోటర్‌ సైతం

ప్రతి నెలా రూ.లక్ష అదనపు బిల్లు భారం

2025 జనవరి నుంచి

కొనసాగుతున్న వైనం

పట్టించుకోని అధికారులు

మాఫీ అవుతుందిలే అంటున్న

నకిలీ డాక్టర్‌

రూ.వేలల్లో బిల్లు వస్తే కనెక్షన్‌ కట్‌ చేసే విద్యుత్‌శాఖ అధికారులు 19 నెలలుగా ప్రభు త్వ ఆస్పత్రి కరెంట్‌ను కాంట్రాక్టర్‌ విని యోగిస్తున్నా నిర్లక్ష్యం వహించటం చర్చనీయాంశంగా మారింది. భవన నిర్మాణం కో సం ప్రత్యేక మీటర్‌ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సంబంధించిన లైన్‌మన్‌, ఏఈలు పర్యవేక్షించకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement